Saturday, March 21, 2026

*పంచాయతీ ఎన్నికల్లో ప్రజల నమ్మకం కోసం-పోలీస్ ఫ్లాగ్ మార్చ్** శాంతియుత వాతావరణంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు పోలీసుల సిద్ధత——-*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య ) ఈ నెల 11వ తేదీ సర్పంచ్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలనే లక్ష్యంతో కోరుట్ల మండలంలో పోలీసులు భారీగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు, మెట్ పల్లి డీఎస్పీ ఏ. రాములు పర్యవేక్షణలో, కోరుట్ల సీఐ బి. సురేష్‌బాబు ఆధ్వర్యంలో మాదాపూర్, పైడిమడుగు, కల్లూరు, ఐలాపూర్, యూసుఫ్‌నగర్, నాగులపేట్ గ్రామాల్లో శాంతిభద్రతలపై నమ్మకం కల్పించేలా ఫ్లాగ్ మార్చ్ జరిగింది. గ్రామాల్లో ఎన్నికల నేపథ్యంలో ఏలాంటి భయాందోళనలు అవసరం లేదని, ప్రజలు నిర్భయంగా తమ ఓటును వినియోగించుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు.*ఎన్నికలలో స్వేచ్ఛా ఓటు – భద్రతా ఏర్పాట్లు పటిష్టం*ఫ్లాగ్ మార్చ్ సమయంలో గ్రామాల్లో పోలీసులు ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని ఎన్నికల సమయంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. కోరుట్ల ఎస్సై ఎం. చిరంజీవి, ఎస్సై రామచంద్ర, కథలాపూర్ ఎస్సై నవీన్‌కుమార్, మేడిపల్లి ఎస్సై శ్రీధర్‌రెడ్డి తదితర సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొని రాబోయే పోలింగ్‌కు ముందు భద్రతా బందోబస్తును పరిశీలించారు. సర్పంచ్ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు._____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News