Thursday, March 19, 2026

పంచాయతీ ఎన్నికల ముందు మహిళలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం- మాజీ జెడ్పీటీసీ కనగండ్ల కవిత

నేటి సాక్షి, బెజ్జంకి:అన్నిచోట్లా మహిళా ఓట్లు కీలకంగా మారిన వేళ… పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నాయని భావించి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మహిళలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మాజీ జెడ్పీటీసీ కనగండ్ల కవిత విమర్శించారు.ఆమె శనివారం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం ఆనవాయితీగా కొనసాగిందని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే చీరలు ఇస్తామని చెప్పి, మిగతా మహిళలను విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ వాగ్దానాలు నెరవేర్చని కాంగ్రెస్ నేతలు,ప్రతి మహిళకు ₹2500 రూపాయలు,ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలుఇవన్నీ చెప్పి ఓట్లు తెచ్చుకున్నారనీ, ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయని భావించి చీరలను కూడా ఎంపిక చేసిన కొద్ది మంది మహిళ సంఘాల సంఘాల సభ్యులకు మాత్రమే ఇస్తూ “వంచనా రాజకీయాలు” చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.“మిగతా మహిళలకు ఓట్లు లేవా? 18 ఏళ్లు నిండిన అమ్మాయిలు ఓటర్లు కారా? వారిని ఎందుకు విస్మరిస్తున్నారు?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బయటపడిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని మాజీ జడ్పీటీసీ కవిత పిలుపునిచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News