నేటి సాక్షి, నల్లబెల్లి జనవరి 05 : ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు కార్యక్రమం నల్లబెల్లి మండలం, కొండలపల్లి గ్రామంలో మిరప, ఉద్యానవన పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించరు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ రీసర్చ్ సెంటర్ మల్యాల శాస్త్రవేత్త డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ, నల్ల తామర పురుగు, పచ్చదోమ, తెల్లదోమ, వైరస్‌ల నివారణపై సూచనలు అందించారు. ఎకరాకు 30-40 పసుపు అట్టలు, జిగురు పూసిన నీలి బట్టలు వేయాలని, కానుగనూనె, వేపనూనెలు వాడాలని చెప్పారు.నాణ్యమైన విత్తనాల ఎంపిక చేయాలని రైతులకు సూచించారు.మండల వ్యవసాయాధికారి రజిత మాట్లాడుతూ, ఉద్యాన పంటలు లాభదాయకమని, ఆయిల్ పామ్, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో వేస్తే ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ఆయిల్ పామ్‌లో నీటి, ఎరువుల యాజమాన్యం, గెలలు కోతపై మార్గదర్శకత్వం. గ్రోమోర్ ఏరియా మేనేజర్ బోరాన్, మెగ్నీషియం పట్టికేసన్‌లో వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానాధికారి అల్లకొండ జ్యోతి, విస్తరణాధికారి త్రివేణి, ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ కరుణాకర్ రైతులు కోలగాని రామారావు, లింగారెడ్డి, వీరారెడ్డి, పెద్దలకొమరారెడ్డి, అనుముల లింగారెడ్డి తదితరులు హాజరయ్యారు.

