నేటి సాక్షి:–ఇటీవల కురిసిన మెంథ భారీ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి వెంకటేశ్వరరావు కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి స్వామన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం స్థానిక నెమలి వెంకట రెడ్డి సిపిఎం పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ మండలంలో 14 గ్రామపంచాయతీలు తొమ్మిది మజారా గ్రామాలు ఉంటే కేవలం 7 గ్రామపంచాయతీ చెందిన రైతులకు నష్టపరిహారం ప్రకటించడం మిగతా గ్రామాల రైతులకు ఎందుకు ప్రకటించలేదని వారు అధికారులను ప్రశ్నించారు ఖరీఫ్ సీజన్ నుంచి మొదట్లో వర్షాలు పడక వేసిన పంటలు దునివేయడం జరిగిందనీ. మళ్లీ తర్వాత వేసిన మొక్కజొన్న సోయాబీన్ ఉల్లి మిరప పంటలకు అధిక వర్షాలు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు అతివృష్టి అనావృష్టి ప్రకృతితో పోరాడుతూనే రైతులు కౌలు రైతులు పండించిన మొక్కజొన్న పంటకు సరైన గిట్టుబాటు మద్దతు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు రైతులకు పంటల బీమా పథకం ఉండి ఉంటే ఇబ్బందులకు గురయ్యేవారు కాదన్నారు అలాగే మొక్కజొన్న పంటకు 2400 మద్దతు ధర ఉంటే ప్రైవేటు వ్యాపారస్తులు కేవలం 1750 కొంటున్నారని దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు ప్రభుత్వం తక్షణమే మార్క్ పెడ్ ద్వారా మండల కేంద్రాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు పంట నష్టపరిహారం అంచనా వేయడంలో వ్యవసాయ అధికారులు విధుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు వచ్చే రబి సీజన్లో అన్నదాతలకు ఉచితంగా సబ్సిడీ విత్తనాలు ఎరువులు ఇవ్వాలని అలాగే రుణమాఫీ కూడా చేయాలని వారు కోరారు మండలంలోని అన్ని గ్రామాలలో నష్టపరిహారం క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని వారు సూచించారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యే ఎంపీ జోక్యం చేసుకుని రైతులకు పంట నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి మేకల రాజు రైతులు శ్రీను రాజన్న పాల్గొన్నారు





