నేటి సాక్షి: నారాయణపేట, జూన్ 18, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా ఇవ్వడంతో నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పూసలపాడు గ్రామంలో బుధవారం రైతన్నలు ఆనందంతో… సంతోషంతో కాంగ్రెస్ పార్టీ జెండాలను పంట పొలాలలో ఏర్పాటులు చేసుకున్నారు. మరికల్ మండలంలోని ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పేరు జోరుగా రైతన్నలు చర్చించుకుంటున్నారు.

