Friday, March 20, 2026

పంట వ్యర్ధాలు కాల్చడం వల్ల కలిగే నష్టాలువివరించిన శాస్త్రవెత్తలు,వి. భాస్కర్. జి. శ్యామ్ ప్రసాద్.

నేటి సాక్షి,కొడిమ్యాల నవంబర్ 25రైతు నేస్తం లో బాగంగా మంగళవారం కోడిమ్యాల,పూడూరు, తిరుమలాపూర్ రైతు వేదికల్లలో రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం జరిగింది. విత్తన చట్టం కొత్త బిల్లు 2025, పంట వ్యర్థాలు కాల్చడం వల్ల కలిగే నష్టాలు, పంట అవశేషాలు వినియోగం గురించి శాస్త్రవేత్తలు వివరించారు. కోడిమ్యాల రైతు వేదిక లో జిల్లా వ్యవసాయ అధికారి v. భాస్కర్ , జిల్లా ఉద్యాన అధికారి G. శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. నూతన విత్తన చట్టం మీద రైతుల అభిప్రాయాలు తీసుకోడం జరిగింది. దీనిలో భాగంగా డబ్బు జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ, విత్తన నష్టం వల్ల నష్టపరిహారం రైతులకి జిల్ల స్థాయిలోనే అందేలా, అలాగే రైతు స్తాయి లో విత్తనోత్పతి చేస్తే మార్కెటింగ్ వివాదాన్ని నూతన చట్టం లో పొందుపర్చాలని కోరడం అయినది. అనంతరం కొండాపూర్ గ్రామంలో నూనె రాములు ఫీల్డ్ ను సందర్శించి పంట అవశేషాలు కాల్చడం వల్ల కలిగే నష్టాలు వివరించడం జరిగింది. పంట వ్యర్థాలు కాల్చకుండా ,కలియదున్నలని అలాగే కలియ దున్ని మురుగు బెట్టి,పైన పేరుకుపోయిన నీటిని తీసియేయాలని రైతులకి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి జ్యోతి, ఏఈఓ లు శ్రీలత, రాజేష్.గ్రీష్మ ,మాజీ mptc డబ్బు జగన్మోహన్ రెడ్డి, అభ్యుదయ రైతు వెలుముల రామ్ రెడ్డి, HEO అనిల్ కుమార్. రైతులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News