Thursday, March 5, 2026

*పకడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ* * బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు* పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్—–*

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం జగిత్యాల ఎస్.కె.ఎన్.ఆర్ (బాలుర) జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు.పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు.*విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించాలి*ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.పరీక్షా గదుల్లో వెలుతురు, తాగునీరు, శౌచాలయాల నిర్వహణ సక్రమంగా ఉన్నాయా అనే విషయాలను పరిశీలించారు.విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. *పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్*పరీక్షా కేంద్ర పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు విషయాన్ని అధికారులు పాటించాలని సూచించారు. మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కేంద్రంలోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ సక్రమంగా కొనసాగాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.పరీక్షల సమయంలో పారదర్శకత, క్రమశిక్షణ పాటించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని కోరారు. పరీక్షా సిబ్బంది తమ విధులను నిబద్ధతతో, భాద్యతగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ఒకే విధమైన ప్రమాణాలు పాటించాలని తెలిపారు.వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.విద్యుత్ సరఫరా అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.పరీక్షలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ పరిశీలనలో డిఐఈవో నారాయణ, తహసీల్దార్ రామ్మోహన్ మరియు తదితరులు పాల్గొన్నారు.______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News