- మాట తప్పని ప్రభుత్వం మాది
- రెండు రోజుల క్రితం కొంతమంది చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు
- పంగిడిపల్లి గ్రామ రైతులు, కాంగ్రెస్ నాయకులు

నేటి సాక్షి, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం రుణమాఫీ కాలేదని గ్రామంలోని పలువురు రైతులు ఒంటికాలి పై నిల నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వారు చేసిన ఆరోపణలని అవాస్తవాలని మంగళవారం రోజున పంగిడిపల్లి గ్రామంలోని మరి కొంతమంది రైతులు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఏడాది కాలంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్న ప్రభుత్వం మాది అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లి గ్రామంలో ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ 80% రైతులకు లబ్ధి చేకూరిందని, రెండు రోజుల క్రితం కొంతమంది రైతులు చేసిన కార్యక్రమం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా ఉందని అన్నారు. వారు చేసిన ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాటలు వేస్తూ ప్రజల్లో ఎల్లవేళలా ఉంటున్నాడని, ప్రతి పథకం ప్రజలకు అందేలా చూస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, ఇతర పార్టీల మాటలు నమ్మవద్దన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి, రైతులు పాలాభిషేకం నిర్వహించారు. కాగా వీరి మీడియా సమావేశం కు వచ్చిన ఓ రైతు మన కాడ ఎక్కడ 80% రైతు రుణమాఫీ అయిందో చూపాలని, చూపిస్తే ముక్కు నేలకు రాస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు తిప్పారపు యుగేందర్, ఓబిసి రాష్ట్ర కార్యదర్శి బాలపురి కనకరత్నం, సాంబయ్య, రాజు, చిన్న బాబు, శ్రీను, ఆదిరెడ్డి, నరసయ్య, లింగారావు, లింగమూర్తి, రైతులు పాల్గొన్నారు.

