నేటి సాక్షి 31 జనవరి పగిడ్యాల :—పగిడ్యాల మండలం యం.ఘణపురం ఎన్.ఘణపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేసిన నందికొట్కూరు ఎమ్మెల్యే శ్రీ గిత్త జయసూర్య ..ఎమ్మెల్యే గిత్త జయసూర్య వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించారు అలాగే రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే చేరుతాయని పింఛన్ పెంచి ఒకటో తారీకు సెలవు దినాలు అయితే ముందు రోజే పంపిణీ చేసిన ఘనత దేశ చరిత్రలోనే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి చెందుతుందని ఎమ్మెల్యే గారు కొనియాడారు.అనంతరం: ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రాతకోట గ్రామంలో, డి లక్ష్మీదేవి గారికి 20000/- రూపాయలు మంజూరైన చెక్కును లబ్ధిరాలుకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య .ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి , మాజీ సర్పంచ్ చంద్రేష్, మద్దిలేటి గౌడ్, నాగేశ్వరరావు, శీను, రమణ, శ్రీనివాసులు, హరికుమార్, వేణుగోపాల్, హరిబాబు, బాలకృష్ణ, కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు,





