నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ పట్టణ కేంద్రంలోని సాయి బాబా ఆలయం నుండి లింకేజి రోడ్డు ద్వారా జాతీయ రహదారి గుండి వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రోజువారీ రాకపోకలు కష్టతరంగా మారడంతో పాటు వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేసినా పరిష్కారం లభించకపోవడంతో ఆగ్రహించిన పట్టణ ప్రజలు ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వెంటనే రహదారి నిర్మాణ పనులు ప్రారంభించాలని, ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.





