Wednesday, March 11, 2026

పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాలి

నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి మార్చి 09 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన. ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా 2K రన్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ షహీన్ సుల్తానా , వైస్ చైర్‌పర్సన్ డా. కొత్తపల్లి అనిత , మరియు మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి.జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు ఈ పరుగు ఉదయం తెలంగాణ తల్లి.చౌరస్తా నుండి ప్రారంభమై రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు కొనసాగింది అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ ప్రజల్లో ఆరోగ్యం, పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించామని పట్టణంలో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పెంపొందించడం పరిశుభ్రతను ఒక సామాజిక బాధ్యతగా మార్చడమే ఈ 99 రోజుల ప్రగతి ప్రణాళిక ముఖ్య దేశమని ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారుఈ సందర్భంగా గాంధీ పార్కులో పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయ పద్ధతిలో రీసైకిల్ చేస్తూ, కంపోస్ట్ తయారీ విధానాన్ని అధికారులు ప్రారంభించారు. చెత్త నిర్వహణ ( వేస్ట్ మేనేజ్మెంట్) ద్వారా పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఈ సందర్భంగా వివరించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎమ్మాజీ శారద, కచ్చకాయల జ్యోతి, కావేటి విజయ్ కుమార్, వాసిమున్నిస, పెండోర్ మాణిక్యారావులతో పాటు ఆర్‌పీలు, ఎస్‌హెచ్‌జీ మహిళలు, మున్సిపల్ సిబ్బంది మరియు పత్రికా విలేకరులు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News