Friday, March 6, 2026

పట్టణ అభివృద్ధిలో మాతో పాటు మీరు భాగస్వామ్యులు కావాలి : ఎమ్మెల్యే బిఎల్ఆర్

నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నూతంగా ఏర్పాటైన నూతన కౌన్సిల్ సభ్యులతో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంపై శుక్రవారం మొట్ట మొదటి సమావేశాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుధా బాలు, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా 29వ వార్డ్ కౌన్సిలర్ జావిధ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మున్సిపల్ అధికారులు తమ విభాగలను తెలియజేస్తూ, పరిచయం చేసుకున్నారు. అనంతరం నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్స్ తమ వార్డ్ లలో ఉన్న ప్రధాన సమస్యలను అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపి, పార్టీలకు అతీతంగా, పట్టణంలోని అన్ని వార్డులు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, అలాగే మీరంతా పట్టణ అభివృద్ధిలో మాతో పాటు భాగస్వామ్యులు కావాలని కోరారు. 48 వార్డుల కౌన్సిలర్స్ అందరితో కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుందని, తమ వార్డ్ లో ఉన్న సమస్యలు ఎలాంటివి ఐనా నేరుగా గ్రూప్ లో ప్రశ్నించవచ్చుని, దాని పరిష్కారం కూడా వెంటనే చేసి కమిషనర్, చైర్మన్ తమకి స్పందిస్తారు అని అన్నారు. అలాగే పరిపాలన విధానం ప్రజలకు తెలియజేసేందుకు, ప్రజాస్వామ్యం కాపాడెందుకు ఇకనుంచి కౌన్సిల్ సమావేశానికి గుర్తింపు కలిగిన మీడియా మిత్రులకు కూడా ఆహ్వానం ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు.రానున్న రెండు సంవత్సరాలలో మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించబోయే పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కౌన్సిలర్స్ కి వివరించారు. అనంతరం కౌన్సిలర్స్ మరియు చైర్మన్, వైస్ ఛైర్మన్ మొదటగా ఎమ్మెల్యే బిల్ఎల్ఆర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారుఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News