నేటి సాక్షి ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : జగిత్యాల పట్టణంలో బుధవారం అరేవ్ అలెవ్ కార్యక్రమాన్ని శ్రీ చైతన్య విద్యార్థులచే పట్టణ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థుల చేతవాహన దారులకు ట్రాఫిక్ పై అవగాహన నిర్వహించారు.హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించిన వారికి ప్రశంస పూర్వకంగా… అలాగే ధరించని వారికి హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించాలి అని తెలియజేస్తూ గులాబీ పుష్పాలను అందజేశారు.ఈ సందర్భంగా పట్టణ ఎస్సై సుప్రియ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ ధరించాలని అన్నారు.. విద్యార్థుల చేత ఈ కార్యక్రమం నిర్వహించడం వలన వారికి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలుగుతుందని అన్నారు.. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కూడా వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించేలా చేయాలని అన్నారు. అనంతరం శ్రీ చైతన్య విద్యార్థులను ప్రశంసించారు.

