నేటిసాక్షి, మిర్యాలగూడ : ప్రతి ఒక్కరు పట్టుదలతో ఇష్టంతో, కష్టపడి చదివితే ఉన్నత లక్ష్యాన్ని సాధించవచ్చని జనయేత్రీ ఫౌండర్, డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే జనయేత్రి ఫౌండేషన్, తెలంగాణలో గ్రూప్-1 ఫలితాల్లో ఉద్యోగాలు పొందిన మధ్యతరగతి మాణిక్యాలను, ఆదివారం జనయేత్రీ ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జనయేత్రీ ఫౌండర్ డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, మా ఫౌండేషన్ తరపు నుంచి ఉన్నంతలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేయడం, సేవ కార్యక్రమాలు చేయడం జరిగిందని, అలాగే మిర్యాలగూడ కు చెందిన మట్టిలో మాణిక్యాలైన మధ్యతరగతి కుటుంబాలకు చెందిన జవేరియా (ఏటీవో), వెంకటేశ్ (సిటీఓ) గ్రూప్-1లో ఉద్యోగం పొందారని, కష్టపడి ఉద్యోగం పొందిన వీరు యువతకు ఆదర్శంగా ఉండాలని, అలాగే ఇంకో పది మందికి వారి గొప్పతనాన్ని తెలపాలని ఉద్దేశంతో ఘనంగా వారిని సన్మానించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ, ఎంతో కష్టపడి గ్రూప్-1 లో ఉద్యోగం సంపాదించడం జరిగిందని, మా కలను కష్టపడి నెరవేర్చుకున్నామని, ప్రతి ఒక్క యువత కూడా కలలుకని తమ కలను సాకారం చేసుకోవాలని కోరారు. అలాగే మాకు సత్కారాన్ని ఏర్పాటు చేసినటువంటి సామాజికవేత్త డా.మునీర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నల్లగొండ జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ అహ్మద్, కార్యదర్శి తాజ్ బాబా, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు కొమరోజు యాదగిరి, పోగుల సందీప్, షాహిర్, రఫీ, అవిరేండ్ల సందీప్, అమీర్, షరీఫ్, ఫహీం, శ్రీనివాస్ రెడ్డి, రాజు గుప్తా, మోయిస్, సైదులు, సోహైల్, రషీద్, జరీనా, సన తదితరులు పాల్గొన్నారు.





