Thursday, March 12, 2026

*పడమటి తండా ప్రైమరీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ వేడుకలు**ముఖ్యఅతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ గుగులోత్ కమల**

నేటిసాక్షి న్యూస్* తిరుమలాయపాలెం మార్చి 12 (మెట్టు రుద్రరాజు)తిరుమలాయపాలెం మండలం లోని పడమటి తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఫేర్వెల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గూగులోత్ కమల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రాథమిక పాఠశాల నుంచి హైస్కూల్‌కు అడుగుపెడుతున్న విద్యార్థులు జీవితంలో కొత్త దశలోకి ప్రవేశిస్తున్నారని అన్నారు. చదువును లక్ష్యంగా తీసుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని, గురువుల సూచనలు పాటిస్తూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థులకు సూచించారు. విద్యే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే గొప్ప ఆయుధమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు.అనంతరం విద్యార్థులకు సర్పంచ్ గుగులోత్ కమల రుచికరమైన భోజనం ఏర్పాటు చేసి అందించారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ గుగులోత్ కమల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. సింధు, ఉపాధ్యాయులు ఎస్. అరుణ, పంచాయతీ కార్యదర్శి బి. సంధ్యారాణి, అంగన్వాడీ టీచర్ బి. పద్మ గుగులోత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News