Tuesday, March 17, 2026

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ- రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతానన్న ఎమ్మెల్యే

నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట గ్రామంలో ఉన్న మణికంఠ పత్తి మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయారని, విత్తినప్పుడు అనావృష్టి, కోత సమయంలో అతివృష్టి కారణంగా పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిల్లర్లు, సీసీఐ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే తడిసిన వరి ధాన్యాన్ని సొసైటీ, ఐకేపీ సెంటర్ల ద్వారా మిల్లర్లకు వేగంగా తరలించాలని అధికారులను ఆదేశించారు.ఎకరాకు పత్తి కొనుగోలు పరిమితిని గతంలో 12 క్వింటాళ్లుగా ఉంచగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 7 క్వింటాళ్లకు తగ్గించిందని చెప్పారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పాత విధానం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు & మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News