Monday, March 16, 2026

పత్తి కొనుగోలు పరిమితి ఎత్తివేయాలి – సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్

నెటి సాక్షి, బెజ్జంకి:పత్తి కొనుగోలులో సీసీఐ విధించిన ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితిని వెంటనే ఎత్తివేయాలని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.మండల కేంద్రంలో జరిగిన సీపీఎం సమావేశంలో మాట్లాడిన ఆయన, కిసాన్ కపాస్ యాప్ రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని, గ్రామీణ రైతుల్లో ఎక్కువ మందికి స్మార్ట్‌ఫోన్ వాడకం తెలియకపోవడం వల్ల పంట అమ్మకాలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.వర్షాల కారణంగా పత్తిలో తేమ శాతం పెరగడంతో సీసీఐ కేంద్రాలు పత్తి స్వీకరించకపోవడం వల్ల రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులకు తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతి పై 11% సుంఖాన్ని ఎత్తివేయడం భారత రైతులకు భారీ నష్టమని పేర్కొన్నారు.పత్తి రైతుల సమస్యలు తీరే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బొమ్మిడి సాయి కృష్ణ, సంఘ ఎల్లయ్య, బోనగిరి లింగం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News