నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ ఏరియాలోని ఓ దుకాణంలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించిన సీసీఎస్ పోలీసులు దాడి చేయగా, నిషేధిత చైనా మాంజా 10 రీల్స్, మొత్తం రూ.4,000/- విలువ గల అక్రమ మాంజాను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మాంజాను ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.పట్టుబడిన వ్యక్తి:ఆడే పోశెట్టి (తండ్రి: గను), వయస్సు: 35 సంవత్సరాలు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ మాట్లాడుతూ, “చైనా మాంజా వలన పర్యావరణానికి తీవ్ర నష్టం కలగడమే కాకుండా, మనుషులకు, ముఖ్యంగా పిల్లలకు ప్రాణాపాయం కలిగే అవకాశముంది. ఎవరూ కూడా నిషేధిత చైనా మాంజాను విక్రయించకూడదు. భవిష్యత్తులో ఇలాంటి మాంజాను విక్రయించి అనవసరంగా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొవద్దు” అని దుకాణదారులను హెచ్చరించారు.ఈ దాడిలో సీసీఎస్ సిబ్బంది ఇన్స్పెక్టర్ బుద్దే రవీందర్, ఎస్సై రాజుకందూరు, కానిస్టేబుళ్లు సంజీవ్, దేవేంద్ర పాల్గొన్నారు. వీరి పనితీరును జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ గారు అభినందించారు.

