నేటి సాక్షి,కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, కెరమెరి మండలంలోని కేలికే గ్రామంలో పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెరమెరి ఎస్‌ఐ మధుకర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ మధుకర్ గారు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే హానికర ప్రభావాలు, బాల్య వివాహాల వల్ల ఏర్పడే సమస్యలు, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం తదితర సామాజిక అంశాలపై గ్రామస్తులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. ఎవరైనా మాదకద్రవ్యాల వినియోగం లేదా అక్రమ సరఫరా గురించి సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని కోరారు.పోలీస్ కళాజాత బృందం సభ్యులు పాటలు, నాటికల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఆకట్టుకునే ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాజాత బృంద సభ్యులు, గ్రామస్తులు, యువత, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

