Wednesday, March 18, 2026

*పత్రికా ప్రచురణార్థం* ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా టిఆర్టిఎఫ్ 80 వసంతాల “అని ” విద్యాసదస్సు పోస్టర్ల ఆవిష్కరణ…టిఆర్టిఎఫ్ 80 వసంతాల రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయండి..టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్…

నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):డిసెంబర్ 21వ తేదీన హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ 80 వసంతాల అభ్యుదయోత్సవ వేడుకల విద్యాసదస్సు పోస్టర్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టిఆర్టిఎఫ్) 1944 లో స్వాతంత్ర పూర్వం నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడానికి ఏర్పడిన ఏర్పడిన సంఘమన్నారు. మొదట ఏపీటిఎఫ్ ఏర్పడిన సంఘం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టిఆర్టిఎఫ్ గా అవతరించిందన్నారు. నాటి నుంచి నేటి వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పట్ల ఉద్యమిస్తున్న సంఘం అన్నారు. అనంతరం టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ… నాటి నుండి నేటి వరకు ఉపాధ్యాయుల హక్కుల కొరకు విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తూ 80 సంవత్సరాలు గడిచిన సందర్భంగా డిసెంబర్ 21వ తేదీన హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ 80వసంతాల అభ్యుదయోత్సవ వేడుకల విద్యాసదస్సుకు ఉద్యోగ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై తెలంగాణ రాష్ట్రం టీచర్ ఫెడరేషన్ 80 వసంతాలు రాష్ట్ర సదస్సు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్న గారి నారాయణ, రాష్ట్ర బాధ్యులు పోతుగంటి రమేష్, గోలి రాధకిషన్, మామిడాల రమేష్,కొనారావుపేట మండల అధ్యక్షుడు గాజెంగి విష్ణు, తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు బూట్ల శ్రీనివాస్, టి ఆర్ టి ఎఫ్ నాయకులు ఇప్ప కాయల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News