నేటి సాక్షి, నారాయణపేట,మార్చ్ 17, ( రిపోర్టర్ ఇమామ్ సబ్ ), నారాయణపేట జిల్లాలోని జాజాపూర్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అనురాధ అనే అమ్మాయి గత చాలా రోజులుగా అనారోగ్యంతో హైదరాబాదులో చికిత్స పొందుతున్నది. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఉపాధ్యాయ బృందం అప్పంపల్లి లో ఉన్న అమ్మాయి ఇంటికి వెళ్లి అన్ని రకాలుగా ధైర్యం చెప్పి చికిత్స కోసం రూ,18 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రతాప్ భాను ప్రకాష్ లక్ష్మణ్,నరసింహ,రఘురాం, రెడ్డి,మంగళ,శశిరేఖ, నిర్మల, శ్రీదేవి,శిరీష,శ్రీ సాయి కృష్ణ,మాణిక్యప్ప, వెంకటేష్,నితిన్ రెడ్డి పాల్గొన్నారు.





