నేటి సాక్షి, నారాయణపేట,నవంబర్ 18, నషా ముక్తా భారత్ అభియాన్ ఐదేళ్ల పూర్తి సందర్భంగా నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్* ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ప్రతి పౌరుడు, ముఖ్యంగా ప్రతి పోలీసు, యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్ గా పనిచేయాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడితే మీ భవిష్యత్తు అంధకారం అవుతుందని ఈ అలవాటు వ్యసనంగా మరి వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాదు కుటుంబం, సమాజం మొత్తాన్ని దెబ్బతీస్తుందని యువత భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. పోలీస్ విభాగం మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటుందని తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిలో అవగాహన కల్పించాలని తెలిపారు. డ్రగ్స్ బారిన పడిన, రవాణా చేస్తున్న, అమ్మిన అట్టి వ్యక్తుల సమాచారం లోకల్ పోలీసులకు లేదా డయల్ 100 కి లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆన్నారు. ప్రస్తుతం ప్రతి పోలీసు, యువత సైబర్ వారియర్‌గా పనిచేస్తున్నారు అని ఇకనుండి యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్ గా పనిచేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కొరకు డ్రగ్స్ ఫ్రీ నారాయణపేట జిల్లా కొరకు ప్రజలంతా పాటుపడాలని ఎస్పీ కోరారు. పోలీసులు స్కూల్స్, కాలేజీలలో, గ్రామాలలో కాలనీలలో, పట్టణాలలో ప్రజలకు డ్రగ్స్ వినియోగం వల్ల ఏర్పడే అనార్థాలను వివరంగా, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాల అదే విధంగా డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్ రహిత జిల్లా కొరకు అందరు పాటుపడాలని అన్నారు.మాదకద్రవ్యాల నివారణలో పోలీసు–ప్రజా భాగస్వామ్యం కీలకమని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి ఎండి రియాజ్ హూల్ హాక్, డిఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, సీఐ శివ శంకర్, ఎస్సై లు వెంకటేశ్వర్లు, నరేష్, సురేష్, పురుషోత్తం, సునీత, పోలీస్ సిబ్బంది, డిపిఓ స్టాప్ తది తరులు పాల్గొన్నారు.





