గ్రామపంచాయతీ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి నారాయణపేట ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 23,గ్రామపంచాయతీ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని నారాయణపేట ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు అధ్యక్షత ఎదురింటి నరసింహులు వహించగా ఈ ఈ కార్యక్రమానికి ఉద్దేశించి( టి యు సి ఐ ) జిల్లా ఉపాధ్యక్షులు బి.నర్సిములు తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఏ నరసింహ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు చెత్త, చెదారం మధ్య పని చేస్తూ తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పల్లెలను శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంటే వారి సమస్యలను పరిష్కరించవలసిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వారికి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకుండా వారి శ్రమను కారు చౌకగా దోచుకుంటున్నారని విమర్శించారు. మున్సిపాలిటీలో, గ్రామపంచాయతీలో పనిచేసే కార్మికులు ఓకే పని చేస్తున్నప్పటికీ మున్సిపాలిటీలో జీవో నెంబర్ 60 ప్రకారం16,500 చెల్లిస్తుంటే గ్రామపంచాయతీ కార్మికులకు మాత్రం 9500 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ఈ వేతనాలు కూడా ప్రతి నెల చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్ పెడుతున్నారు అన్నారు. దీనివల్ల కుటుంబ పోషణ భారమై కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అన్నారు. మల్టీపర్పస్ విధానం పేరుతో అనుభవం లేని పనులు చేయించడం వలన అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ఎలాంటి చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతినెల జీతాలు చెల్లించుటకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, పదవీ విరమణ బెనిఫిట్ కింద 5 లక్షలు చెల్లించాలని, కార్మికులు మరణించినా, పదవీ విరమణ పొందినా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, గ్రామపంచాయతీ పర్మిట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల అధ్యక్ష కార్యదర్శులు వెంకటయ్య, రాజు, కృష్ణయ్య , రామ్ చందర్, వెంకటేష్ బాలకృష్ణ, రాములు నారాయణ, కాళప్ప, సిద్ధిరాం, మహేష్ గోపాల్, అశోక్, భీమ్సప్ప, ఓడెప్ప, లక్ష్మి, పద్మమ్మ, నరసింహులు, గోవింద్, వెంకటప్ప, ఆంజనేయులు,తదితరులు పాల్గొన్నారు.

