నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ‘పంచాయతీ’ ఎన్నికల్లో తాము బలపరిచిన స్థానంలో బోణి కొట్టింది.ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ‘కానుగంటి లాస్య రాజశేఖర్’ సర్పంచ్ గా ఏకగ్రీవ ఎన్నికయ్యారు.*మగ మహారాజులదే రాజ్యం.!*ఈ పంచాయతీ ఎన్నికల్లో బిసిలకు 42% రిజర్వేషన్ లు కేటాయించాలని కొందరు కోర్టు మెట్లెక్కి విఫలమయ్యారు. కాగా..ఇదే క్రమంలో ఏళ్ల నుంచి మహిళలకు 33% రిజర్వేషన్ లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.దరిద్రమేంటంటే..రిజర్వేషన్లంటే..పదవి దక్కేవరకే..జస్ట్..’యూజ్ అండ్ త్రో’..ఇది కాదనలేని సత్యం.! ఈ నేపథ్యంలో.. ఏ ఎన్నికలైనా మహిళాలకు కేటాయించిన ‘రిజర్వేషన్’లో గెలుపొందే వరకు ‘ఆమె’ను ముందుంచి ప్రచారం చేసుకుంటారు. ఆ తర్వాతా అంతే.! మీటింగ్ లకు ‘ఆమె’ను భర్తనో.. బ్రదర్ సో..తండ్రో..కొడుకులో.. తీసుకెళతారు ‘నిశానికి’..రబ్బరు బొమ్మలా ‘కుర్చీ’లో కూర్చోబెట్టి.. ‘తెరవెనుక’ రాజకీయమంతా..ఆమె చేయాల్సిన ‘పరిపాలనంతా’ ..మన ‘మగమహారాజు’లదే.! కాదనగలరా.? సరిగ్గా ఇదే క్రమంలో ఇప్పుడు ఈ ‘పంచాయతీ’ ఎన్నికల్లోనూ ఇదే ‘ఆనవాయితీ’ కంటిన్యూ అయ్యింది.!*ఇక్కడే ‘సూపర్ ట్విస్ట్’.!*ఇబ్రహీంపట్నం మండలం మూల రాంపూర్ గ్రామంలో సర్పంచ్ పదవి ‘ఏకగ్రీవమైంది’.! ఇందులో ‘ట్విస్ట్’ ఏంటంటే.. ఏకగ్రీవ సర్పంచ్ గా ఎన్నికైంది మహిళా అభ్యర్థి ‘లాస్య’.! కానీ.. రిజర్వేషన్ దుర్వినియోగానికి పరాకాష్టగా ఆమె భర్త రాజశేఖర్ గెలుపొందినట్టు ‘సోషల్మీడియా’లో వైరల్ చేసుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. అదికూడా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ‘రాజశేఖర్’ను వెంటబెట్టుకుని వెళుతున్న ఓ ‘ఫోటో’ను వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. తమ పార్టీ అభ్యర్థి ‘కానుగంటి.లాస్య రాజశేఖర్’ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మూల రాంపూర్ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఎమ్మెల్యే మెసేజ్ ఒకటి మొబైల్ లలో తెగతిరిగేస్తున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అపుడే ‘ఆమె’పై ..’అతగాడి’ పెత్తనం మొదలైందా.? దానికి ఎమ్మెల్యేనే ప్రత్యక్ష సాక్షిగా ఉండడమా.? ఎలాగూ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది..మరి ‘ఆ-మహిళా సర్పంచ్’ను వెంట తీసుకుని వెళ్లొచ్చుగా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇదేనా.? సంజయ్ఓ శాసనసభ్యుడై ఉండి ఆయన సమక్షంలోనే ‘ఆమె’కు ఇంత ‘అగౌరవం’ లభిస్తే..రానున్న ఐదేళ్ల పదవీ కాలంలో ‘ఆమె’ రబ్బరు స్టాంపేనన్న చర్చలు జరుగుతున్నాయి..’పాపం..లాస్య.!ఏ తోట కాడుందో.? వంటింట్లో ఉందో.!?_______________





