Tuesday, March 10, 2026

పదవి విరమణ సన్మాన మహోత్సవంలో.. పారిజాత నర్సింహారెడ్డి

బడంగ్పేట్ జిల్లా ఉన్నత పాఠశాలల్లో బస్సు వెంకట నారాయణ రెడ్డి పదవి విరమణ

నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని బడంగ్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన బుస్సు వెంకట నారాయణ రెడ్డి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ చేపడుతున్న నారాయణ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి బాలలే రేపటి పౌరులు అని నానుడి ఉండేది అటువంటి బాలలను రేపటి తరాలకు ఆదర్శప్రాయంగా ఉండేందుకు వారికి విద్యా బుద్దులతో పాటు క్రమ శిక్షణ నేర్పడంలో అందరి కన్నా ఉపాధ్యాయులుగా పాత్ర కీలకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, గట్టు బాలకృష్ణ, బొల్లపల్లి కుమార్, ఉపాధ్యాయులు జగదీశ్వర్ రెడ్డి, వెంకట రమణ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రాజశేఖర్, సంగీత, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News