Thursday, March 19, 2026

పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు గుడిబండ..విద్యార్థుల జీవితాలతో చలగాటమా..” పిల్లికి చెలగాటం – ఎలుకకు ప్రాణ సంకటం” అన్నచందంగా కూటమి ప్రభుత్వ వైఖరి..

నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 12 ~అన్నమయ్య జిల్లా :-: పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విద్యార్థుల భవిష్యత్తుకు గుదిబండగా మారుతోందని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని కూటమి ప్రభుత్వ వైఖరి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నట్టుందని పీలేరు నియోజకవర్గ సమాచార హక్కు చట్టం అధ్యక్షులు మద్దిరాళ్ళ మల్లికార్జున అన్నారు. పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటనలోనూ కూటమి ప్రభుత్వం విఫలం చెప్పిందని ఆయన పేర్కొన్నారు. ఏపీలో షెడ్యూలు విద్యార్థుల భవితకు గండంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. షెడ్యూలు తేదీలు మార్పు చేయకపోతే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు గడ్డు కాలమేనని తెలంగాణ షెడ్యూలు ముద్దు ఆంధ్ర షెడ్యూలు వద్దని టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను వెంటనే మార్చాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ విద్యార్థుల సంక్షేమం కోరి పరీక్షల షెడ్యూలును మార్చాలని విద్యావ్యవస్థ అవలంబిస్తున్న తీరుపై విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలన అర కొర పాలన లానే అరకొర అర్థం పర్థం లేని షెడ్యూలు తో విద్యార్థులు ఇబ్బందులు పడుతారని కాబట్టి టెన్త్ పరీక్షల షెడ్యూలు ను తక్షణమే ఉపసంహరించుకో వాలని కూటమి ప్రభుత్వాన్ని పీలేరు నియోజకవర్గ సమాచార హక్కు చట్టం అధ్యక్షులు మద్దిరాళ్ళ మల్లికార్జున కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూవిద్యాశాఖ ప్రకటించిన పదో తరగతి పరీక్షల షెడ్యూలు పై విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. కుదించిన 7 పేపర్లను 16 రోజుల పాటు నిర్వహించడం సరికాదన్నారు. పరీక్షల షెడ్యూలు విద్యార్థుల భవిష్యత్తుకు గుడిబండగా మారిందన్నారు. సాధారణంగా పరీక్షల సమయం ప్రతి సబ్జెక్టుకు 5 రోజులు వ్యవధి సమయం తగ్గకుండా ఉండాలన్నారు. అలా కాకుండా వెంట వెంటనే పరీక్షల షెడ్యూలు సమయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడంతో ఇటు విద్యార్థులు అటు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయంలో పడి దిక్కు తోచని స్థితిలో ఉన్నారన్నారు. తగిన వ్యవధి సమయం కేటాయించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఉత్కంఠకు లోనై బిడియంతో, మానసిక మనోవ్యదకు గురికాక తప్పదన్నారు. భయాందోళనలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పరీక్షలు కూడా సరిగా రాయలేక నానా అవస్థలు పడక తప్పదన్నారు. విద్యార్థులకు విద్య దూరం అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందన్నారు. అపరిచితంగా పరీక్షలు షెడ్యూలు ప్రకటించడం శోచనీయంమన్నారు. ” పిల్లికి చెలగాటం – ఎలుకకు ప్రాణ సంకటం” అన్నచందంగా కూటమి ప్రభుత్వం తయారయిందన్నారు. విద్యార్థుల పరీక్షల షెడ్యూలు ప్రకటనలో “తుగ్లక్ “పాలనను తలపిస్తుందన్నారు. పాలన వైఫల్యానికి, నిర్లక్ష్యానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూలును నిలిపివేయాలన్నారు. అశాస్త్రీయంగా రూపొందించిన SSC పరీక్షల టైం టేబుల్ ను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. టెన్త్ పరీక్షల షెడ్యూల్ (2026-MAR-16 నుంచి APR-1 వరకు) పై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మరియు విద్యాశాఖ మంత్రి వివరణ ఇవ్వాలన్నారు. స్టూడెంట్స్ రిక్వెస్ట్ తో పరీక్షల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వాలన్నారు. CB SE, ఇతర బోర్డుల విధానాలను అధ్యయనం చేసి సైంటిఫిక్ గా షెడ్యూల్ రూపొందించాలన్నారు. మ్యాథ్స్, సైన్స్, సోషల్ కు ఎక్కువ రోజులు వ్యవధి ఇవ్వాలన్నారు. అందువలన స్టూడెంట్స్ ఏలాంటి ఒడిదొడుకులకు లోనవ్వకుండా, ఒత్తిడి లేకుండా, నెమ్మదిగా, నిర్భయంగా, నిదానంగా, ప్రశాంతంగా రివిజన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అదే తెలంగాణలో అయితే ప్రతి సబ్జెక్టుకు వ్యవధి 5 రోజులకు తగ్గకుండా 2026 మార్చి14 నుంచి ఏప్రిల్ 16 వరకు 7 పేపర్లను 35 రోజుల పాటు పరీక్షలు నిర్వహించే విధంగా సమయంలో మార్పులు చేశారన్నారు. తెలంగాణ షెడ్యూల్ ను చూసైనా చూసైనా కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణాను చూసి నేర్చుకునే దుస్థితికి ఆంధ్ర రాష్ట్రంలోని విద్యావ్యవస్థ దిగజారిందన్నారు. తెలంగాణా లో షెడ్యూల్ మాదిరే యథా తథంగా ఆంధ్రాలో కూడా పరీక్షలు కొనసాగించితే మంచిదన్నారు. అమెరికా, కెనడా విదేశీ పర్యటనలు ముగించుకొని వచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల సంక్షేమం కోరి షెడ్యూలును మార్చి విద్యార్థులను ఆదుకోవాలని మద్దిరాళ్ళ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు..~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News