నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):ప్రధాని మోదీ కానుకగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి బండి సంజయ్ అందిస్తున్న ఉచిత సైకిళ్లను గురువారం చందుర్తి, మల్యాల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు వేములవాడ బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ చెన్నమనేని వికాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నమనేని వికాస్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 20వేల సైకిళ్లను పంపిణీ చేయాలని బండి సంజయ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు మోదీ కిట్ పేరుతో సహాయాన్ని అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పది వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన కోసమే ఎంపి బండి సంజయ్ ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దీంతో పాటు ఎక్కువశాతం విద్యార్థుల తల్లిదండ్రులు కూలీ పని చేసి జీవనాన్ని కొనసాగించేవారు ఎక్కువ ఉన్నారని అలాంటి వారు తమ పిల్లలకు పరీక్ష ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదని తెలుసుకున్న బండి సంజయ్ తన నియోజకవర్గ పరిధిలోని ఆయా స్కూళ్లలో చదివే విద్యార్థుల ఫీజు మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకున్నట్లు వికాస్ రావు తెలిపారు. విద్యార్థుల పరీక్ష ఫీజు ఆ మొత్తాన్ని తన వేతనం నుండి చెల్లించాలని నిర్ణయించూకున్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు పంపారన్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి సంజయ్‌కుమార్‌కు రిటర్న్‌గిఫ్ట్ ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





