నేటి సాక్షి,నారాయణపేట, జనవరి 1 ( రిపోర్టర్ ఇమామ్ సాబ్),పదవ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించి జిల్లాకు ,పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని నారాయణపేట జిల్లా అదనపు రెవిన్యూ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సందర్శించి విద్యార్థినుల విద్యపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సిబ్బంది అదనపు కలెక్టర్కు ఘనంగా స్వాగతం పలికి పాఠశాల వివరాలు తెలియజేశారు. పాఠశాలలో పదవ తరగతిలో 75 మంది విద్యార్థులు చదువుతున్నారని ప్రిన్సిపాల్ యాదమ్మ తెలిపారు. అలాగే కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థుల వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో 43 మంది పదవ తరగతి చదువుతున్నారని స్పెషల్ ఆఫీసర్ తెలిపారు. పదవ తరగతిలో జిల్లా ఉత్తమ ర్యాంక్ సాధించేలా ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులు కష్టపడాలని తెలిపారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల కేజీబీవీ లలో 250 ప్యాడ్స్ 250 బుక్స్, పెన్ ,పెన్సిల్లు విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీధర్, తాసిల్దారులు, టీచర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

