Sunday, March 8, 2026

***పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ విజయవంతం*

నేటి సాక్షి చిలుకూరు. ఏఐఎస్ఎఫ్ , ఏఐవైఎఫ్ ల ఆధ్వర్యంలో చిలుకూరు మండల కేంద్రంలోని కవిత జూనియర్ కళాశాలలో నిర్వహించిన పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ కార్యక్రమం విజయవంతమైనట్లు ఆయా సంఘాల జిల్లా బాధ్యులు చేపూరి కొండలు, తమ్మనబోయిన నరేష్ లు తెలిపారు. ఇట్టి టాలెంట్ టెస్ట్ కు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 887 మంది విద్యార్థులు హాజరైనట్లు వారు తెలిపారు. టాలెంట్ టెస్ట్ ప్రారంభానికి ముందు సిపిఐ సీనియర్ నాయకులు కస్తూరి సైదులు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ అంబాల వెంకటి గార్ల చేతుల మీదుగా ప్రశ్నాపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టాలెంట్ టెస్టులు విద్యార్థులలో దాగివున్న ప్రతిభను వెలికితీయటానికి దోహదపడతాయని అన్నారు. టాలెంట్ టెస్ట్ నిర్వాహకులు చేపూరి కొండలు తమ్మనబోయిన నరేష్ లు మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్షలు అంటే భయాన్ని తొలగించడం కోసం, త్వరలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేయడం కోసం వారిని ఇప్పటినుండే ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలకు సంసిద్ధం చేయడం కోసం ఇట్టి టాలెంట్ టెస్ట్ ను నిర్వహించామని, టాలెంట్ టెస్టు విజేతలకు ఈనెల 5వ తేదీన బహుమతులు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో విశ్రాంత అధ్యాపకులు కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు కవిత జూనియర్ కళాశాల కరస్పాండెంట్ మాదాల శ్రీధర్ సిపిఐ నాయకులు చిలువేరు ఆంజనేయులు, సిరాపరపు శ్రీనివాస్ రావు, విష్ణు భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కొల్లు శ్రీనివాస్, ఎస్ టి యు నాయకులు కొండ వెంకయ్య, ఏఐవైఎఫ్ చిలుకూరు మండల అధ్యక్ష కార్యదర్శులు అనంతల రాము, కడారు మధు, గోసు వెంకటేష్ ,సాకి నరేష్, డేగ వీరన్న, కొల్లు శ్రీకాంత్ , వెంకటలక్ష్మి, సాయివర్షిత, అనుష ,నిక్షిత, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News