Saturday, March 14, 2026

పబ్లిక్ టాయిలెట్లు మాత్రమే ఉపయోగించండి

ప్రజా మరుగుదొడ్లను శుభ్రపరిచిన పారిశుద్ధ కార్మికులు నేటి సాక్షి – కోరుట్ల ( రాధారపు నర్సయ్య ) 100 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం యెకీన్పూర్ దగ్గర గల టాయిలెట్ ను మున్సిపల్ కార్మికులు స్వయంగా శుభ్రపరచారు.ఇందులో భాగంగా ఈరోజు మున్సిపాలిటీలో విధులు నిర్వహించే ఆటో డ్రైవర్లు తమ రోజూ వారి విధులు ముగిసిన తరువాత 100 రోజుల క్యాంపెయిన్ లో పాల్గొన్నారు.కోరుట్ల పట్టణంలోని ఏకీన్పూర్ బస్టాండ్ వద్దన్న పబ్లిక్ టాయిలెట్ వద్దకు వెళ్లి దానిని స్వయంగా శుభ్ర పరచారు‌. అనంతరం ‘బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధించాలి.. పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించాలి’ అని నినాదాలు చేశారు.అంతే కాకుండా ఈ క్యాంపెనియన్ లో భాగంగా కోరుట్ల పట్టణంలోని ప్రజలు మరియు పరిసర ప్రాంతాల నుంచి కోరుట్ల పట్టణానికి వచ్చేటటువంటి ప్రజలు పట్టణంలోని పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించుకుని కోరుట్ల పట్టణాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణంగా మార్చడం కొరకు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమం లో శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ , ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మహేష్ మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు._____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News