నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 26,
నారాయణ పేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని రాకొండ గ్రామంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్పుల శ్యామల్ గారి తండ్రిగారైన ఏర్పుల బుచ్చన్న (డానియల్) గారు స్వర్గస్తులైనారు, అలాగే పెద్ద చింతకుంట గ్రామ కాంగ్రెస్ నాయకులు గదుమలి కృష్ణయ్య గారి తండ్రిగారైన గదుమల్లి వెంకటన్న గారు మరణించడం జరిగినది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ సూర్య మోహన్ రెడ్డి గారు వారి భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు తోడుగా ఉంటుందని భరోసానివ్వడం జరిగినది. వీరి వెంట స్థానిక నాయకులు జయసింహారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాసన్న,బుచ్చన్న ,రాఘవేందర్, హరీష్ కుమార్,పోలెమోని రామకృష్ణ, పీ రఘు, రామకృష్ణారెడ్డి, మల్లారెడ్డి, బోయ వెంకటేష్, సద్దాం, వెంకటేష్ తదితరులు నివాళులర్పించడం జరిగింది.





