Friday, March 20, 2026

*పరిశోధనల ద్వారానే బాల శాస్త్రవేత్తలను తయారు చేయాలి : అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, బి. రాజ గౌడ్* *- 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శిని**-విశిష్ట అతిథిగా రాష్ట్ర ఎస్సీఈఆర్టీ (SCERT) డైరెక్టర్ జి .రమేష్*—————————————–

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………………..శుక్రవారం రోజున జగిత్యాల పురాతన హైస్కూల్ లో 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శిని 2025-2026 మరియు ఇన్స్పైర్ మనాక్ అవార్డ్స్ 2024 -25 కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జిల్లా విద్యాధికారి కె. రాము ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించడం జరిగింది. అనంతరం విశిష్ట అతిథిగా రాష్ట్ర ఎస్సీఈఆర్టీ (SCERT) డైరెక్టర్ జి .రమేష్ హాజరైనారు. అనంతరం విద్యార్థుల నూతన ఆవిష్కరణల తో ఉన్న తరగతి గదులను సందర్శించడం జరిగింది. *ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ మాట్లాడుతూ*53వ బాల వైజ్ఞానిక ప్రదర్శిని 2025 -26 కు సంబంధించి జిల్లా స్థాయిలో 350 ప్రదర్శనలు మరియు 13వ ఇన్స్పైర్ మనాక్ అవార్డుకి సంబంధించి 118 ప్రదర్శనలు వచ్చినట్లు తెలిపారు. బాల శాస్త్రవేత్తల ఆలోచనలకు ఒక రూపం రూపొందించి విద్యార్థులంతా ప్రదర్శనలు తీసుకొని రావటం జరిగిందని, వికసిత భారత్ ప్రధాన అంశముగా సుమారుగా 400 వినూత్న ఆలోచనలు విద్యార్థులచే రూపొందించడం జరిగిందని తెలిపినారు. *అదనపు కలెక్టర్ బి.ఎస్ లత మాట్లాడుతూ* ఆది మానవుని కాలము నుండి నేటితరం వరకు ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు కనుగొనబడ్డాయి, వాళ్ళ ద్వారా మనం కొత్త కొత్త పరికరాలు వాడడానికి కారణం శాస్త్రవేత్తల ఆవిష్కరణలే అని అవి మానవాళికి నిరంతరం ఎంతో ఉపయోగమని పరిశోధనల ద్వారానే కాలానుగుణంగా ప్రతి బాల శాస్త్రవేత్తలు తయారు చేయాలని తెలిపారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మీరు కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి మన దేశాన్ని కూడా మంచి పేరు సమాజానికి కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అన్ని రంగాల్లో మన దేశం ముందు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని విద్యార్థులు గైడ్ టీచర్లు కొత్త ఆలోచనలకు సంబంధించిన ప్రయోగాలను తీసుకొని రావటం జరిగింది. *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ మాట్లాడుతూ* అబ్దుల్ కలాం మనదేశంలో శాస్త్రవేత్తగా ఆవిష్కరణలు చేయనట్లయితే డిఫెన్స్ లో మనం ఇతర దేశం మీద ఆధారపడ వలసి వచ్చేది అని అదే స్థాయిలో మీరు ఆలోచించి వినూత్న ప్రదర్శనలకు బాటలు వేసుకొవాలని ఆకాంక్షించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా విద్యార్థులు తప్పుదోవ పట్టి ప్రమాదం బారిన పడకుండా సద్వినియోగం చేసుకోవాలని మరియు విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. అలాగే మంచి మానవ సంబంధాలు కూడా పెంపొందించుకోవాలని హితబోధ చేసినారు. సమాజంలో మీకు గుర్తింపు ఉన్నప్పుడే మీ తల్లిదండ్రులకు గౌరవం దక్కుతుంది అని ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను బయటకు తీసి ఇటువంటి వేదికల ద్వారా అవి ప్రదర్శించేలా చేయాలని అవేంతగానో మానవాళికి ఉపయోగపడతాయని, అమెరికాలోమన భారతీయులు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారని, అలాంటి ప్రతిభ ఉన్న వారిని ఉపాధ్యాయులు ముందుకు తీసుకెళ్తే మనం కూడా చరిత్రలో నిలిచిపోతామని ఉపాధ్యాయులకు తెలిపినారు. ఇందులో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News