Monday, December 23, 2024

పరిసరాల పరిశుభ్రత ప్రధానం…!

మురికి కాలువల పరిశుభ్రత,నిరు నిలిచే ప్రదేశాల శుభ్రం

పాగింగ్ యంత్రాలతో దోమల నివారణకు మాలతియన్, బైటేక్స్ స్రె

గ్రామాలలో కొనసాగుతున్న ఫీవర్ సర్వే

సిజనల్ వ్యాదుల పట్ల అవగాహన చేస్తున్న సిబ్బంది

మలేరియా , టైఫాయిడ్ ,డెంగ్యూ సీజనల్ జ్వరాలకు మందుల పంపిణీ

నేటి సాక్షి – ఇబ్రహీంపట్నం
పరిసరాల పరిశుభ్రం మురికి కాలువల లో నీరుని లోపల ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ దోమలు నిలిచే ప్రదేశాలలో ఫాగింగ్ యంత్రాల ద్వారా మాలతియన్, బైటేక్స్ స్రె తో మందు పిచ్చకారి చేస్తూ గ్రామాల్లో సీజనల్ వ్యాధుల పట్ల పూర్తిస్థాయి అవగాహన చేస్తూ గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేసి పూర్తి వివరాలను సేకరించి ఫీవర్ వచ్చిన వారికి ఉచితంగా మందులను అందజేస్తూ సీజనల్ వ్యాధుల పట్ల ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఎఎన్ఎం లు,ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టిచర్ లు గ్రామపంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు అవగాహన చర్యలు చేపడుతున్నారు.అవసరం అయిన చోట పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల తో శుభ్రం చేయిస్తున్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గోధూర్, తిమ్మాపూర్, తిమ్మాపూర్ తండా, యమాపూర్, ఫకీర్ కొండాపూర్ ,వేములకుర్తి ,భర్తిపూర్, మూలరాంపూర్, ఏర్దండి, కోమటి కొండాపూర్, కేశపూర్, కోజన్ కొత్తూరు, ఇబ్రహీంపట్నం, డబ్బా, అమ్మకపేట్, ఎర్రపూర్ గ్రామాలలో ఇబ్రహింపట్నం ఎంపిడిఓ రాజేంధర్ రెడ్డి,ఎంపీఓ చంద్రశేఖర్ అదేశాల మేరకూ గత నాలుగు రోజులుగా అయా గ్రామలలోని వార్డులలో ప్రదాన మురికి కాలువలను శుభ్రం చేస్తు,పిచ్చి మెక్కలను తోలగిస్తున్నారు. దోమల నివారణకు పాగింగ్ బైటేక్స్, మాలతియన్ మందుతో స్రె చేస్తు ప్రతి రోజు గ్రామస్తుల నుండి తడీ పోడీ చెత్తను వేరుగా స్వికరించి డంపింగ్ యార్డు లకూ తరలిస్తున్నరు. గ్రామస్థులకు ప్రతి శుక్రవారం డ్రె పాటీంచాలని,పాడైన టైర్లు, కోబ్బరీ బోండా లను బయట వేస్తె నిరు నిలిచి దోమల లార్వ ల తయారు,ప్లాస్టిక్ కవర్ లు ,పాత రహదారులు ల లో నిరు నిలిచి వ్యాదులు వ్యాప్తి చెందే విదానం పైన అవగాహన చేస్తున్నరు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అదేశాలతో ఇబ్రహింపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధ్వర్యంలో ముడు రోజులుగా గ్రామలలోని ప్రతి ఇంటికి వెళ్ళి కుంటుబ సభ్యుల వివరాలు వారి ఆరోగ్య పరిస్థితి ని తెలుసుకుంటు ఫివర్ సర్వే చేస్తు జ్వరం, తలనొప్పి, దగ్గు ,సరిది తదితర సమస్యలు ఉన్న వారికి ఉచితం గా మందులు అందచేస్తున్నరు.దోమల జనాభాను తగ్గించడానికి, దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను వదిలించుకోండి. బహిరంగ పక్షి స్నానాలు మరియు పెంపుడు జంతువుల నీటి వంటలలో నీటిని క్రమం తప్పకుండా మార్చండి, బకెట్ల నుండి నిలిచిపోయిన నీటిని ఖాళీ చేయండి. టైఫాయిడ్, మలేరియా,డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులపై సంపూర్ణ అవగాహన కల్పిస్తూ జ్వరం వస్తే సమీపంలోని ఆరోగ్య కేంద్రం లేదా ఏఎన్ఎం లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పై దృష్టి సాదించాలి

మండల పంచాయతీ అధికారి సాంబారి చంద్రశేఖర్

గ్రామాలలో ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సాధించి తమ చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు తమ ఇంటి ముందుకు వచ్చే చెత్త బండికి తడి ,పొడి చెత్త వేరువేరుగా అందించి గ్రామపంచాయతీ పారిశుద్ధ సిబ్బందికి సహకారించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరు అని గుర్తించాలి.

జ్వరం వస్తె సమిపం లోని ఆరోగ్య సిబ్బంది సప్రదించాలి

ఇబ్రహింపట్నంఆరోగ్య కేంద్ర వైధ్యులు హరిష్

జ్వరం వస్తె సమిపం లోని ఆరోగ్య సిబ్బంది సప్రదించాలి పరిసారలను శుభ్రం గా ఉంచుకోవాలి.సాధారణంగా అందరికీ ఎప్పుడో ఒకప్పుడు జ్వరం వస్తుంది.జ్వరం వస్తే బాడీ టెంపరేచర్ ఎంత ఉందో ప్రతి పూటా టెస్ట్ చేసుకునేవాళ్లను చూస్తుంటాం.అయితే, మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత, ఎంత ఉష్ణోగ్రత దాటితే జ్వరం అనాలి?శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ మన మెదడులోని హైపోతలామస్‌లో ఉంటుంది.సిజనల్ వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News