నేటి సాక్షి : మంచిర్యాల జిల్లా,, చెన్నూర్ లో రేపటి నుండి జరుగబోయే ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రల వద్ద 163 BNSS (144 సెక్షన్ ) అమలులో ఉంటుందని గుంపులు గుంపులు గా పరీక్ష కేంద్రాల దగ్గర లో ఉండరాదని అలాగే కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు, పరీక్ష కేంద్రం నుండి 200 మీటర్ల దూరంలో గల జిరాక్స్ షాప్స్ ఎగ్జామ్ పూర్తి అయ్యేవరకు తెరవరాదని, మొబైల్ ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు గాని ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించబడవని ఎగ్జామ్స్ రాసే ఇంటర్మీడియట్ విద్యార్థులు 30 నిముషాల ముందుగానే సెంటర్ కు చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇట్టి నిబంధనలను ఎవరైనా ఉల్లంగించిన యెడల వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు,





