నేటి సాక్షి,బుగ్గారం.నక్క శంకరయ్య రిపోర్టర్బుగ్గారం మండల కేంద్రంలో శుక్రవారం నాడు ఎస్సీ,ఎస్టీ దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వివరాల్లోకెళ్తే బుగ్గారం మండల కేంద్రానికి చెందిన పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు మినీ ఫంక్షన్ హాల్ కొరకై మంత్రి అడ్లూరిని సంప్రదించగా అభివృద్ధిలో భాగంగా పోచమ్మ కమిటీ సభ్యులకు వారు అడిగిన 10 లక్షల కాకుండా అదనంగా 5 లక్షల రూపాయలు కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు.తదనంతరం రెవెన్యూ స్థలంలో ఉన్న భూమిని ఐకెపి సెంటర్ కొరకు రైతుల అవసరం దృష్ట్యా అందజేసి ఐకెపి సెంటర్ ను ప్రారంభించారు. తదనంతరం సిరికొండ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రెవెన్యూ సిబ్బంది మరియు ఐకేపీ సిబ్బంది వ్యవసాయ అధికారులు ఎంపీడీవో సిబ్బంది జిపి స్పెషల్ ఆఫీసర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేముల సుభాష్ ఉపాధ్యక్షుడు నరస గౌడ్ యూత్ అధ్యక్షులు అంజిత్ కుమార్ రైతులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





