నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*వెదురుకుప్పం:-*రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ విప్ జీడి.నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా.వి.ఎం.థామస్ సూచనల మేరకు వెదురుకుప్పం మండలంలో మారేపల్లి హరిజనవాడలో 12.60 లక్షల, మొండి వెంగనపల్లి పంచాయతీ బండమీదఇండ్లులో 7.50 లక్షల సిమెంట్ రోడ్లకు పల్లెపండుగ సందర్భంగా వెదురుకుప్పం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోహన్ మురళి సిమెంట్ రోడ్లకు భూమి పూజ చేశారు మోహన్ మురళి మాట్లాడుతూ వెదురుకుప్పం మండలానికి గతం ఎప్పుడు లేని విధంగా స్థానిక ఎమ్మెల్యే డా.వి.ఎం.థామస్ నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు పరుగులు తీయించడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో మారెపల్లి సర్పంచ్ అనుబురాసి, మొండివెంగనపల్లి ఉపసర్పంచ్ భాస్కర్ రెడ్డి, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డి, ఏపీఓ మీనాకుమారి, పంచాయతీ కార్యదర్శి మహేష్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గిరి, బూత్ కన్వీనర్ పోటుగారి.శ్రీధర్,ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మిరెడ్డి, టిడిపి మండల కార్యనిర్వాక కార్యదర్శి విక్రమ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి,హరినాథ్, తదితరులు పాల్గొన్నారు

