నేటి సాక్షి,బాపట్ల జిల్లా (పర్చూరు)పర్చూరు నియోజకవర్గంలో ప్రజల హృదయాల్లో నిలిచిన “పల్లె పల్లెకు తెలుగుదేశం” కార్యక్రమం ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తి కావడం సందర్భంగా పర్చూరు బొమ్మల సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తిని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి నాయకులు కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ శంషుద్దీన్ మాట్లాడుతూ, గ్రామ గ్రామాన అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగిందని గుర్తు చేశారు.ప్రజలతో నేరుగా మమేకమై నాయకత్వానికి బలమైన పునాది వేసిన ఈ పాదయాత్ర పర్చూరు నియోజకవర్గ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కోడూరి శేష బ్రాహ్మచారి, టౌన్ పార్టీ అధ్యక్షులు ఆకుల శ్రీను,కొల్లా బుల్లి బాబు,అబ్రహం,గద్దె చిన్న, కొండగంటి శివ, టి. శ్రీను, సాంబయ్య, కటారి సురేంద్ర, కటారి దుర్గా,సుమన్, శ్రీధర్, సురేష్, మల్లా శ్రీను, చంటి తదితరులు పాల్గొన్నారు.





