నేటి సాక్షి మార్చి 19 (మంచిర్యాల్ ) శ్రీధర్ దమ్మ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి ఆలయo ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పవిత్ర పుణ్యక్షేత్రం గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సత్యనారాయణ స్వామి ఆలయం ఒకటే కాకుండా ఆంజనేయ స్వామి ఆలయము, అయ్యప్ప స్వామి ఆలయము, మరియు షిరిడిసాయిబాబా ఆలయము ఇక్కడ ప్రసిద్ధి చెందినవి.ఈ ఆలయాలకు కూతవేటు దూరంలోనే గంగా నది ఉంది. వివిధ రాష్ట్రాల నుండి భక్తులు ఇక్కడికి అధికంగా విచ్చేసి గంగా నదిలో స్నానం చేసి ఈ ఆలయాలలో భక్తి, శ్రద్ధలతో దేవుళ్లను దర్శించుకుంటారు. అయితే ఈ ఆలయాల పరిసర ప్రాంతాలలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుపుతూ ఇక్కడికి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు వాటి నిర్వాహకులు. అలాగే ఈ బెల్ట్ షాపుల నిర్వాహకులు బార్లను తలపించే విధంగా మందుతోపాటు మటన్, చికెన్, చేపలు వండుతూ మందుబాబులకు అధిక రేట్లతో మద్యం అమ్ముతూ ప్రజల జేబులకు తూట్లు పొడుస్తున్నారు. ఈ తతంగాన్ని చూసిన కొందరు భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాల వద్ద ఇలాంటి దందా లు ఏంటని ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఈ వ్యవహారం ఎదేచ్ఛగా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతున్నా పట్టించుకోని సంబంధిత ఎక్సైజ్ అధికారులు. సంబంధిత అధికారులకు తెలిసే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది అని వారికి ముట్టే మాముల్లు యధావిధిగా వారికి ముడుతున్నందుకే వారు ఎలాంటి రైడింగులు, కేసులు చేయడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఇలాంటి అక్రమ వ్యాపారులపై మరియు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ అక్రమ దందాలను వెంటనే అరికట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.





