Tuesday, March 10, 2026

పశువైద్యశాల అధికారిణి మమతకు సర్పంచ్ సన్మానంమునగాల,

నేటి సాక్షి సూర్యపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామ పశువైద్యశాలలో రైతులు, పశుపాలకులకు నిబద్ధతతో సేవలందిస్తున్న పశువైద్యాధికారిణి మమతను గ్రామ సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. పశుసంపద అభివృద్ధి, జంతు ఆరోగ్య పరిరక్షణలో మమత అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సర్పంచ్ తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ, గ్రామంలో పశువైద్యశాల ద్వారా తక్షణ చికిత్సలు, అవగాహన కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే సేవాభావంతో గ్రామానికి సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పశుపాలకులు పాల్గొని పశువైద్యాధికారిణి మమతను అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News