నేటి సాక్షి నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో చాకలి చంద్రకళ కుటుంబంపై దాడి చేసిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని, న్యాయం చేయాలని మంచిర్యాల పట్టణ రజక సంఘం అధ్యక్షులు పరిపెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ పోశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తా లో రాస్తారోకో, కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టరు.అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు అంటరానితనం అనేది కుకటి వేర్లతో పెకిలించి పారద్రోలాలనే దృఢసంకల్పంతో ఆనాడు డా. బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కఠిన శిక్షలు పొందుపర్చినప్పటికీ, నేటి ఆధునిక సమాజంలో కూడ కొందరు అగ్రవర్ణ పెత్తందార్ల దుశ్చర్యల వలన సామాన్యలు బలై పోతున్నరన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో శ్రీ ముల్లన స్వామి జాతర సందర్భంగా మా చాకలి (రజక) చంద్రకళ కుటుంబం కూడా స్వామి వారి దర్శనం కోసం వెళ్తే అ గ్రామం లోని అగ్రవర్ణకులములకు చెందిన గ్రామసర్పంచ్ మరియు ఆలయ నిర్వాహకులు మరియు కొంత మంది వీరిపై తీవ్రంగా మాకుమ్మడిగా దాడి చేసి, చంద్రకళ ఎత్తుకున్న చంటి బిడ్డను లాక్కొని విసిరిపారేసారని ఆవేదన వ్యక్తం చేశారు.. దీంతో పాప అచేతన స్థితిలోకి వెళ్ళిపోవడంతో వెంటనే చికిత్సకోసం హస్పిటల్ కు తీసుకవెళ్లిన కాపాడుకోలేకపోయారని తెలిపారు.ఈ అగ్రవర్ణ కుటుంబాల దుశ్చర్య సభ్యసమాజం తలదించుకునేల అవమానకరమైన సంఘటన అయినందున తమరు ఈ సంఘటనను మానవీయకోణంలో కన్సీడర్ చేసి, ఈ సంఘటనకు బాధ్యులనై వారందరిపై చట్టపరమైన కరీనాతికఠినమైన చర్యలు తీసుకుని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.లేని యెడల జిల్లాలోని రజకులు వృత్తి బంద్ కు పిలుపునివ్వడం జరుగుతుందని ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి నస్పూరి పోశం, ముఖ్య సలహాదారు నేరెళ్ల రమేష్, బీసీ సంఘాల నాయకులు నరెడ్ల శ్రీనివాస్, గజేల్లి వెంకటయ్య, రజక సంఘం నాయకులు దొడ్డిపెల్లి రవీందర్, ఏదుళ్ల రాజాం, జంగపెల్లి సతీష్, తోటపెల్లి శ్రీనివాస్, ఒరగంటి సత్యనారాయణ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

