నేటి సాక్షి, బాపట్ల జిల్లా (బాపట్ల టౌన్)పసి బాలుడి వైద్య ఖర్చులకోసం స్నేహితుల సహాయ సహకారాలతో బాలుడికి ఆర్థిక సహాయం అందజేశామని ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బండ్రెడ్డి గోపి అన్నారు. బాపట్ల పట్టణం వెంగల్ విహార్ కు చెందిన ఆనంద్ దంపతులకు నాలుగు రోజులు కిందట బాబు జన్మించాడు. శ్వాసకోస సమస్యతో వైద్యశాలలో మెరుగైన చికిత్స అందించడం కోసం సుమారు 8 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు అన్నారు. ఈ సందర్భంగా బండ్రెడ్డి గోపి మాట్లాడుతూ బాలుడి ఆరోగ్య సమస్యని తెలుసుకున్న ఆర్గనైజేషన్ సభ్యులు తమ దృష్టికి తీసుకురావడంతో ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ద్వారా ఆర్థిక సహాయం బాలుడి కుటుంబ సభ్యులకు అందించామన్నారు. జన్మించిన మూడు రోజులకే శ్వాసకోస సమస్యతో ఇబ్బంది పడుతూ మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న పసి బాలుడికి తాము అందించిన సహాయం చిన్నదేనని మరికొందరు ధాతలు ముందుకు వచ్చి బాలుడు వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు, కోశాధికారి జోగి సువర్ణ రాజు, భీమా కోటేశ్వరరావు, యశం రాజా రమేష్, బొగ్గవరపు శివ,కరీం, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.





