నేటి సాక్షి నారాయణపేట జనవరి 13,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పసుపుల గ్రామంలో క్రీడా ప్రాంగణం దగ్గర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామ పసుపుల గ్రామ సర్పంచ్ జవుల పురం నర్మద రవి కుమార్ గౌడ్. ఉపసర్పంచ్ బి. మహేష్ ల అధ్వారంలో ప్రారంభించారు. ఈ క్రికెట్ టోర్నమెంటులో గ్రామ మెంబర్లు గ్రామ యువకులు పెద్దలు పాల్గొనడం జరిగింది. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కలిసి మెలిసి ఆటలలో పాల్గొని అందరు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని. అంతా మనమే అనుకుని బహుమతులు గెలుచుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పసుపుల గ్రామ వార్డు సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

