డీఎఫ్ఓ అనుజ్ అగర్వాల్ తో కలిసి పాకాల సరస్సు, పరిసర ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్*నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ (సందెల రాజు)పాకాలను ఎకో టూరిజం గా మరింత అభివృద్ధి చేయుటకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా అటవీ శాఖ అనూజ్ అగర్వాల్ తో కలిసి క్షేత్ర స్థాయిలో నర్సంపేట రేంజ్ లోని పాఖాలలో గ్రీన్ హెరిటేజ్ క్రింద అభివృద్ధి చేసిన బయోడైవర్సిటీ పార్కును, బట్టర్, ట్రిక్కింగ్, సైక్లింగ్, పగోడాలను పరిశీలించిన అనంతరం కలెక్టర్ పాకాల సరస్సులో బోటింగ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటకులకు ఆకర్షించే విధంగా పాకాల సరస్సు పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయుటకు పటిష్టమైన ప్రణాళికలు రచించాలని డీఎఫ్ఓకు సూచించారు. అందులో భాగంగా బయో డైవర్శిటీ పార్క్ ను మరింత అభివృద్ధి పరచడం, పర్యావరణ పర్యాటక అభివృద్ధి చేయాలని, సఫారీ ట్రాక్ ఏర్పాటు, మూలికల తోట పునరుద్ధరణ, సందర్శకులకు రాత్రి బస సౌకర్యాల అభివృద్ధి, చెరకు ప్యాచ్ అభివృద్ధి, పర్యావరణ పర్యాటక సంబంధిత కార్య కలాపాలకు సంబంధించిన పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ రవి కిరణ్, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

