నేటి సాక్షి నారాయణపేట, అక్టోబర్ 17, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని పాతపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలను విద్యా పరిరక్షణ కమిటీ బృందం పరిశీలించడం జరిగింది పాఠశాలలో తాగునీరు మరియు మూత్రశాలలు మధ్యాహ్న భోజనం విద్యార్థుల విద్య సామర్ధ్యాలు మరియు విద్యార్థుల సమస్యలను విద్యార్థులతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది, కార్యక్రమంలో అధ్యక్షులు కుజురత్ అలీ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే విద్యతో మాత్రమే సాధ్యమవుతుందని తమకు ఎన్ని ఇబ్బందులున్నా చదువును మధ్యలో అపవద్దు అని తమలక్ష్యం వైపు ప్రయాణించాలని విద్యార్థులందరూ క్రమశిక్షణతో విలువలతో కూడిన విద్యార్థులగా ఎదగాలని మాట్లాడారు, అనంతరం పాఠశాలకు నూతన ప్రధానోపాధ్యాయులుగా నియమితులైన శ్రీలత మేడం గారిని శాలువతో సత్కరించారు అలాగే విద్యార్థులకు పెన్నులు మరియు పెన్సిల్లు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వాతి కుమారి, యండి ఫిరోజ్ గ్రామ విద్యా పరీక్ష కమిటీ కార్యదర్శి నవీన్ కుమార్ గౌడ్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ వెంకటేష్ రాము తదితరులు పాల్గొన్నారు.




