నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 12,పేట జిల్లాలోని మరికల్ మండలం లోని మండల వనరుల కేంద్రం నందు పాఠ్యపుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారిని మనోరంజని గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ వసతులతో మెరుగైన విద్యను అందిస్తున్నామని ప్రతి పాఠశాలకు ఉచిత పాఠ్యపుస్తకాల తో పాటు ఉచిత యూనిఫాం మరియు నోటు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ విద్యాసంవత్సరం పాఠ్య పుస్తకాలు యు డి ఐ ఎస్ ఈ ప్రకారం మండలం లోని ప్రతి పాఠశాలకు వంద శాతం ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల ల్లో చదివేవిదంగా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నాగరత్నమ్మ ,బాల నారాయణ , రామ్ రెడ్డి , సిఆర్పిలు శివ కుమార్, అరుణ, ఎంఐఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

