నేటి సాక్షి,నారాయణపేట,నవంబర్ 10,ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న అక్షయపాత్ర ను వెంటనే రద్దు చేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి వెంకటేష్ అన్నారు. సోమవారం నాడు నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు నర్వ, నారాయణపేట దామరగిద్ద, మద్దూర్ మరికల్ తదితర మండల లలో మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో నల్లబ్యార్జీలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించి అనంతరం మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీనవర్గాల పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారంతో పాటు మంచి భోజనాన్ని అందిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నుండి ఎన్నో ఆలోచనలతో గతంలో ఇచ్చిన హామీలను మేరకు కార్మికుల వేతనాలు పెంచాలని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న అక్షయపాత్ర పథకాన్ని తొలగించాలన్నారు. ఈనెల 11న నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా ఈనెల 24న రాష్ట్ర కమిషనర్ ఆఫీసర్ ముందు మధ్యాహ్న భోజన కార్మికులతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం వాళ్ళు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయా మండల కేంద్రాల్లో ఉన్న విద్యాశాఖ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు రేఖమ్మ సునీతమ్మ ఎల్లమ్మ , అనురాధ అంజమ్మ, సాహిదా బేగం, నూర్జాన్ బేగం తదితరులు పాల్గొన్నారు.





