గదికి తాళం వేశారు….
నేటి సాక్షి,నారాయణపేట, జూలై 7,
నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం హై స్కూల్లో 2023న అదనపు గదులు మంజూరు కావడం జరిగిందని సిపిఐ నారాయణపేట జిల్లా కమిటీ సభ్యులు పి వెంకటేష్ తెలిపారు. ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇట్టి పాఠశాలకు మూడున్నర లక్షలు మంజూరు చేయడం జరిగిందని ఆయన వివరించారు. కాంట్రాక్టర్ అదనపు గదులను పూర్తి చేయడం జరిగిందని ఆయన వివరించారు. బిల్లులు లేదని నిర్మాణం చేసిన అదనపు గదులకు తాళం వేశారన్నారు. పూర్తిచేసిన అదనపు గదిలో కాంట్రాక్టర్ తన సామాగ్రిని వేసి తాళం వేయడం విద్యార్థులు వరండాలలో కూర్చొని చదువుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. వెంటనే జిల్లా స్థాయి అధికారులు స్పందించి ధన్వాడ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలకు అదనపు గదులకు తాళం తొలగించి విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. అదేవిధంగా పాఠశాలలో హ్యాండ్ వాష్ నేటికీ పూర్తి చేయలేకపోయారని ఆయన వివరించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభారాణి మాట్లాడుతూ జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని ఆమె తెలిపారు. అధికారులు స్పందించి ఉర్దూ మీడియం పాఠశాలలో నిర్మాణం పూర్తి చేసిన అదనపు గదులకు వేసిన తాళం తొలగించి విద్యార్థులకు సౌకర్యంగా కల్పించాలని ఆమె అధికారులను కోరారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.