Wednesday, March 18, 2026

పాఠశాల ఆకస్మికంగా తనిఖీ నారాయణపేట్ డిప్యూటీ కలెక్టర్ పాణి రాజ్

నేటి సాక్షి నారాయణపేట నవంబర్ 17, నారాయణపేట డిప్యూటీ కలెక్టర్ పాణి రాజ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థుల యొక్క చదువును గురించి ప్రతి రోజు విద్యార్థులు 5 గంటలకు లేచి చదవాలని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశంలో తప్పకుండా పాల్గొని తమ విద్యార్థుల యొక్క చదువును గురించి చర్చించాలని విద్యార్థుల యొక్క మార్కులను తల్లిదండ్రుల యొక్క వాట్సప్ కు పంపడం జరుగుతుంది అని ప్రతి ఉపాధ్యాయుడు మరియు తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రతిరోజు విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థి యొక్క హోంవర్క్ ను క్షుణ్ణంగా పరిశీలించాలి పాఠశాలకు వరుసగా గైరాజరైనచో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించాలని పదో తరగతి ఉత్తీర్ణులైన తర్వాత ఏ కాలేజీలో చేరినారో సమాచారము ప్రధానోపాధ్యాయులకు తెలియజేయాలని విద్యార్థి తల్లిదండ్రులు ప్రశాంత వాతావరణంలో చదివేటట్లు ఏర్పాటు చేయాలి విద్యార్థులు గత సంవత్సరము సంబంధించిన ప్రశ్న పత్రాలను చూసి చదవవలెనని తెలియజేశారు మధ్యాహ్న భోజనము తరగతి గదులు పరిశీలించడం జరిగింది విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాముఖిగా మాట్లాడి వారి నుండి విద్యార్థుల యొక్క సమాచారాన్ని రాబట్టడం జరిగింది మరియు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎం గోవిందరాజు మాట్లాడుతూ విద్యార్థి తల్లిదండ్రులకు 10వ తరగతి విద్యార్థులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని వారిని ఉదయము 5 గంటలకు చదివేటట్లు చేయాలని ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థికి వేకప్ కాలనీ చేయాలని విద్యార్థిని తల్లిదండ్రులకు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఏర్పాటు చేసినటువంటి తల్లిదండ్రుల సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని విద్యార్థులు మంచిగా చదివినచో తల్లిదండ్రులకు మరియు పాఠశాలకు గ్రామానికి మంచి పేరు వస్తుందని ప్రభుత్వం సరఫరా చేసినటువంటి అభ్యాస దీపికలను విద్యార్థులు బాగా చదివినచో అందరూ ఉత్తీర్ణులు అవుతారని భౌతిక జీవశాస్త్ర ఉపాధ్యాయులు ల్యాబ్ లో ప్రయోగాలు ద్వారా విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుంటారని మరియు ప్రతి విద్యార్థి స్లిప్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ రాయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి డిసిసిబి కార్యదర్శి రాజేంద్ర కుమార్ మధ్యాహ్న భోజన పథకం ఇంచార్జ్ అధికారి యాదవ్ శెట్టి మరియు మధుసూదన్ రావు భాను ప్రకాష్ నరసింహ నర్సింలు రఘురాంరెడ్డి ఉపాధ్యాయ బృందము పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News