Thursday, March 19, 2026

పాఠశాల, కళాశాలల వద్ద నిరంతరం డేగ కన్ను..ఎవరైనా కర్మ కాలి దొరికారంటే ఇక వారి పని ఖతం..

నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 12 ~అన్నమయ్య జిల్లా :-: జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలల వద్ద పటిష్ట నిఘా ఉండబోతోంది. ఇకపై నిరంతరం డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తుంటారు. ఎవరైనా కర్మ కాలి పోలీసులకు దొరికారంటే వాళ్ల పని ఖతం. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు వదిలే సమయాల్లో విద్యార్థులు, విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేసింది. నిరంతరం డ్రోన్ కెమెరా. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రధానంగా విద్యా సంస్థల పరిసరాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణను చేపడతారు.డ్రోన్ నిఘా..—————————విద్యార్థులు బయలుదేరే సమయాల్లో పాఠశాలలు, కళాశాలల గేట్లు మరియు సమీప ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, పోకిరీల కదలికలను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ “మాదకద్రవ్యాల విక్రయాలు, ఆకతాయిల వేధింపులు (ఈవ్ టీజింగ్), అమ్మాయిలతో గొడవలు వంటి ఘటనలు జరగకుండా విద్యార్థినీలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం మా ప్రధాన లక్ష్యమని ఎస్పీ తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సాదా సీదా దుస్తుల్లో పోలీసులు..——————————————–డ్రోన్ నిఘాతో పాటు, పలు చోట్ల సాధారణ దుస్తుల్లో పోలీసులు, ప్రత్యేక బృందాలు కూడా పర్యవేక్షిస్తుంటాయని ఎస్పీ తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ పోలీసు చర్యలకు సహకరించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ కోరారు..~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News