Thursday, March 26, 2026

పాఠశాల విద్యార్థులకు 34 సైకిళ్ల పంపిణీ

నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు, విద్యార్థినులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మోదీ కానుకగా పంపిన 34 ఉచిత సైకిళ్లను సోమవారం ప్రధానోపాధ్యాయులు రేవతి, శ్రీరాములు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ మహతి లక్ష్మీ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు. బీజేపీ నాయకులు కరివేద మహిపాల్ రెడ్డి, కొలిపాక రాజు తదితరులు మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలో 20 వేల సైకిళ్లు పంపిణీ చేయడం గర్వకారణమన్నారు.అదేవిధంగా 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.10,000 మరియు రూ.5,000 బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు బుర్ర మల్లేశం గౌడ్ కొత్తపేట రామచంద్రం, దొమ్మాటి రాములు, యువ మోర్చా మండల అధ్యక్షులు తూముల రమేష్ యాదవ్, సంగా రవి, బండి పెళ్లి సునీత గౌడ్, లింగాల లావణ్య, వడ్లూరు సాయిలు, వడ్లూరు శ్రీనివాస్, శీలం వెంకటేశం, గంప రవికుమార్, బండి పెళ్లి శ్రీనివాస్ గౌడ్, గూడ అంజిరెడ్డి, బుర్ర కిషన్ గౌడ్, ఐలేని భాస్కర్ రెడ్డి, మండలంలోని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు రాజేశం గౌడ్, యువజన సంఘాల నాయకులు శానకొండ రజనీకాంత్ మరియు విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News